స్టార్ హీరోల సినిమాలు అనుకున్న తేదికి రావడమనేది కొన్నాళ్లుగా కలగా మారిపోయింది. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మార్చ్ 28 నుంచి మే 9 కి పోస్ట్ పోన్ అయ్యింది. మరోపక్క జనవరి నుంచి విశ్వంభర పోస్ట్ పోన్ అయ్యి ఏ తేదికి వెళుతుందో తెలియరావడం లేదు. మరోపక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అయ్యి ఆగష్టు కి వెళ్ళింది అనే టాక్ వినబడుతుంది. వీటన్నికి రకరకాల కారణాలు వినబడుతున్నాయి.
అదే స్టార్ హీరోల ప్రాబ్లెమ్ ఇప్పుడు హీరోయిన్ అనుష్క కి వచ్చింది. అనుష్క నటించిన ఘాటీ చిత్రం కూడా ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అవ్వనుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముందు ఏప్రిల్ 18 న ఘాటీ విడుదల అంటూ మేకర్స్ ప్రకటించారు.
కానీ ఇప్పుడు ఏప్రిల్ 18 నుంచి ఘాటీ విడుదల ఆలస్యమవుతుంది అంటున్నారు.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అనుష్క ఘాటీ చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయినా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవడంతో ఇప్పుడు ఈచిత్రం రిలీజ్ పోస్ట్ పోన్ చేశారనే వార్త వినిపిస్తుంది.