ప్రస్తుతం వైసీపీ లో అసమ్మతి సెగ మొదలయ్యింది. జగన్ మోహన్ రెడ్డి విపరీతంగా నమ్ముతున్న సజ్జల రామకృష్ణ రెడ్డిని జగన్ పక్కనపెట్టాలంటూ వైసీపీ కార్యకర్తలు వెలుగెత్తి చాటకపోయినా.. వైసీపీ నేతలు, వైసీపీలో కీలకంగా వ్యవహరించి బయటికొచ్చేస్తున్న నేతలు జగన్ మొహం మీదే చెబుతున్నారు. జగన్ దగ్గర నమ్మిన బంటుగా చేరి జగన్ కళ్ళకు గంతలు కట్టి అసలు విషయాలు జగన్ వినకుండా వైసీపీ పార్టీ పతనానికి కారణమై, పార్టీని భ్రష్టుపట్టించారనే ఆరోపణలు సజ్జల రామకృష్ణ రెడ్డిపై ఎక్కువైపోయాయి.
సజ్జల తీరుతో పార్టీకి తీరని నష్టం జరుగుతోందని పదే పదే జగన్ వద్ద మొత్తుకుంటున్నా జగన్ పట్టించుకోవడం లేదు అనేది బ్లూ మీడియా వాదన. జగన్ చుట్టూ కోట కట్టి నలుగురు వ్యక్తుల నించోవడంతో జగన్ కు అలాగే పార్టీ కి నష్టం వాటిల్లుతుంది, ముందు జగన్ సజ్జలను పక్కనపెట్టాలని 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి బ్లూ మీడియా స్టిల్ ఇప్పటివరకు జగన్ కు చేరేలా కథనాలు ప్రసారం చేస్తుంది.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా ఎంతోమంది వైసీపీ నేతలు సజ్జలపై తీవ్రమైన ఆరోపణలు చేటున్నారు. కానీ జగన్ అవి విని వినన్నట్టుగా వదిలేస్తున్నారు. వైసీపీ పార్టీ ఏది మొదలు పెట్టినా ముందు సజ్జలనే నించోబెడుతున్నారు. మీడియాకి కనబడకుండా సజ్జల టెలీ కాన్ఫరెన్సులు, పార్టీ కీలక సమావేశాలను నిర్వహిస్తున్న తీరు చూసాక సజ్జలను జగన్ వదులుకోరు అని చాలామంది ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలే ఫిక్స్ అవుతున్నారు.