ప్రస్తుతం సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదు అవుతున్నాయి. రీసెంట్ గా టూరిస్ట్ అన్వేష్ తన యూట్యూబ్ లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సన్నీ యాదవ్ వీడియోస్ షేర్ చెయ్యగా దానికి సజ్జనార్ సోషల్ మీడియాలో స్పందిస్తూ యాక్షన్ తీసుకోవడమే కాదు భయ్యా సన్నీ యాదవ్ పై కేసు పెట్టి అరెస్ట్ చేసారు.
దానితో ఉలిక్కిపడిన మిగతా బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ సోషల్ మీడియా వేదికగా తాము తప్పు చేశామంటూ క్షమాపణలు కోరుతున్నారు. గతంలో హర్ష సాయి తాను గనక ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చెయ్యకపోతే వేరే వాళ్ళు ప్రమోట్ చేసి డబ్బు సంపాదిస్తారు, నేను అయితే అలా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఆ డబ్బుని మంచి పనులకు వాడుతున్నాను అంటూ చెప్పిన ఇంటర్వ్యూని సజ్జనార్ షేర్ చెయ్యడమే కాదు హర్ష సాయి పై కేసు నమోదు చేసారు.
దానితో సురేఖ వాణి కుమార్తె సుప్రీత వేంటనే ఇలాంటి పని మరోసారి చెయ్యను, అది తప్పని తెలిసింది సారీ అంటూ క్షమించండి అంది. ఇంకొంతమంది యాప్స్ ని డిలేట్ చేస్తున్నారు. ఇప్పుడు రైతు బిడ్డ, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మెడకు ఈ బెట్టింగ్ యాప్ కేసు చుట్టుకోనున్నట్లుగా తెలుస్తుంది. గతంలో క్రికెట్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసి పల్లవి ప్రశాంత్ భారీగా డబ్బు సంపాదించాడని, అన్వేషి తన ఛానల్ లో పెట్టాడు.
పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కి వెళ్లి విన్నర్ అయ్యాడు, రైతు బిడ్డ అంటూ సింపతీ క్రియేట్ చేసుకుని ఫాలోవర్స్ ని పెంచుకున్న పల్లవి ప్రశాంత్ పై కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు నమోదు అవుతుంది అంటున్నారు.