మిల్కి బ్యూటీ తమన్నా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ కు లవ్ బ్రేకప్ చెప్పేసింది. గత రెండేళ్లుగా తమన్నా-విజయ్ వర్మ లు చెట్టాపట్టాలేసుకుని ముంబై ఈవెంట్స్ కానీ, పార్టీలకు కానీ, వెకేషన్స్ కి గాని తెగ తిరగేసారు. కానీ కొద్దిరోజులుగా తమన్నా-విజయ్ వర్మ కలిసి కనిపించడం లేదు దానితో ఇరువురికి బ్రేకప్ అయ్యింది అనే వార్తలు వైరల్ అయ్యి కూర్చున్నాయి.
రీసెంట్ గా తమన్నా చాలా హ్యాపీ గా కనిపించింది. రవీనా టాండన్ ఇచ్చిన హోలీ పార్టీలో తమన్నా, విజయ్ వర్మ విడివిడిగా కనిపించినా ఇద్దరూ హ్యాపీ గా కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు రీసెంట్ గా తమన్నా తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంది.
అయితే తమన్నా సోషల్ మీడియా వేదికగా.. జీవితంలో అద్భుతాలు జరగాలి అని ఎదురు చూడకూడదు. దానికి ప్రతీకగా మనమే అద్భుతాలు సృష్టించాలంటూ తమన్నా చేసిన పోస్ట్ వైరల్ గా మారగా.. కొంతమంది తమన్నా అసలు ఏం చెప్పాలనుకుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.