అనిల్ రావిపూడి-దిల్ రాజు కాంబో కి సంక్రాంతి సెంటిమెంట్ ఉంటుంది. వారు ఏ సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేసినా అది పక్కా హిట్. రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. గత ఏడాది సెప్టెంబర్ లో మొదలు పెట్టిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి 90 రోజుల్లో రెడీ చేసి థియేటర్స్ లోకి తెచ్చేసి హిట్ అందుకున్నారు.
ఇప్పుడు మరో సంక్రాంతి మాదే అంటున్నారు అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి చెయ్యబోయే చిత్రానికి సంబందించిన ఫస్ట్ హాఫ్ లాక్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. సెకండ్ హాఫ్ పనులు మొదలు పెట్టారు. ఈలోపు అనిల్ రావిపూడి సింహాచలం లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుని చిరుతో తీయబోయే మూవీ స్క్రిప్ట్ స్వామి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు.
స్వామివారి పూజల అనంతరం అనిల్ రావిపూడి మీడియాతో మట్లాడుతూ.. తన సినిమా కథలకు మొదటినుంచి వైజాగ్ ను సెంటిమెంట్‌గా భావిస్తానని, చిరుతో చిత్రానికి సంబంధించిన కథను సిద్ధం చేసేందుకు వైజాగ్ వచ్చినట్లు చెప్పడమే కాదు, చిరు కథపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.
చిరుతో చెయ్యబోయే మూవీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని.. గ్యాంగ్‌లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు సినిమాల్లోని చిరంజీవి మేనరిజం ఇందులో ఉంటాయి, ఒక నెలలో స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి, మే చివర్లో లేదా జూన్ మొదటి వారంలో మూవీ షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పిన అనిల్ రావిపూడి ఈచిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించారు.