యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు హిందీలో కి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్న వార్ 2 చిత్రం ఆగష్టు 14 న విడుదల కాబోతున్నట్లుగా మరోమారు మేకర్స్ రిలీజ్ తేదీని కన్ ఫర్మ్ చేసారు. ఎన్టీఆర్ ముంబై టు హైదరాబాద్ అంటూ ఎయిర్ పోర్ట్స్ లో కనిపించడమే కానీ, దేవర చిత్రం తర్వాత ఆయన నుంచి ప్రోపర్ అప్ డేట్ రావడంలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఫీలవుతున్నారు.
అదేదో ఫ్యాన్స్ మీట్ అంటూ ప్రకటించారు. అది ఎప్పుడో చెప్పట్లేదు. దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో రోజు రోజుకి ఆత్రుత ఎక్కువైపోతుంది. ఎన్టీఆర్ నటించిన హిందీ మూవీ వార్ 2 నుంచి ఏదైనా ఓ పోస్టర్ వదిలితే ఆ లెక్కలు మారిపోతాయి అనేది వారి కోరిక. కానీ హిందీ మేకర్స్ సినిమా విడుదల వరకు ఎలాంటి పోస్టర్స్ వదలరు.
సౌత్ సినిమాల్లో మాదిరి మూవీ పోస్టర్స్, స్టిల్స్ అని వదలరు. టీజర్, ట్రైలర్ అవసరమైతే సాంగ్ వదులుతారు కానీ పోస్టర్ మాత్రం వదలరు. మరి ఆగస్ట్ 14 లోపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక వార్ 2 మేకర్స్ ఏమైనా తీరుస్తారో, లేదో అనేది మాత్రం సస్పెన్స్ అనే చెప్పాలి.