అక్కినేని అఖిల్ మాస్ హీరోగా అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తే.. ఆ చిత్రం మాస్ ఆడియన్స్ ను విపరీతంగా డిజప్పాయింట్ చేసింది. ఆతర్వాత హలొ, మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు ప్రేమ కథతో కూడిన కుటుంబ కథా చిత్రాలే, అవన్నీ సో సో రిజల్ట్ తోనే సరిపట్టుకోవాల్సి వచ్చింది.
దానితో మరోమారు అఖిల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటూ ఏజెంట్ చిత్రం చేసాడు. అఖిల్ చిత్రం లాగే ఏజెంట్ కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది. దానితో రెండేళ్ల గ్యాప్ తో అఖిల్ తన తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టాడు. వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు నందుతో అఖిల్ కొత్త ప్రాజెక్ట్ రెగ్యులర్ షూట్ ఈ నెల 14 న మొదలైంది.
అయితేకొడుకు కోసం నాగార్జున ఏరికోరి నందుని సెలెక్ట్ చేసింది.. కుటుంబ కథా చిత్రం కోసం, తమ ఫ్యామిలీకి కుటుంబ కథా చిత్రాలు అచ్చొచ్చాయని ఈసారి అఖిల్ కి అలాంటి నేపధ్యమున్న కథ కావాలని నాగ్ ఇలా నందుతో పల్లెటూరి నేపథ్యంలో సినిమా లాక్ చేసారని ప్రచారం జరిగింది.
లెనిన్(వర్కింగ్ టైటిల్) తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కుటుంబ కథ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. మరి అఖిల్ నందుతో చేస్తున్న చిత్ర నేపధ్యమేమిటో ప్రస్తుతానికైతే సస్పెన్స్ అనే చెప్పాలి.