బిగ్ బాస్ కి వెళ్లేముందు ఏంతో ఎగ్జైట్ అవుతూ.. ఇకపై ఫేమస్ అయిపోవచ్చు, బిగ్ బాస్ తో లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు అంటూ చాలా ఆతృతగా బిగ్ బాస్ కి వెళ్ళడము, బయటికొచ్చాక అనుకున్న క్రేజ్ రాక పోగా, ఇటు నెటిజెన్స్ నుంచి ట్రోలింగ్ కి గురై డిప్రెషన్ లోకి వెళ్ళినవాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో గీత మాధురి, వితిక సేరు, పునర్నవి లాంటి వాళ్ళు ఈ కోవలో ఉన్నవాళ్లే.
తాజాగా యాంకర్ శిల్ప చక్రవర్తి తను బిగ్ బాస్ కి వెళ్లి పెద్ద తప్పు చేసాను అంటుంది. ఒకప్పుడు టాప్ యాంకర్ గా కొనసాగిన శిల్ప చక్రవర్తి తర్వాత పెళ్లి చేసుకుని, కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. రీ ఎంట్రీ ఇచ్చే క్రమంలో ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్ళింది, చాలా త్వరగా ఎలిమినేట్ అయ్యింది. తాజాగా ఆమె బిగ్ బాస్ కి వెళ్లి తప్పు చేశాను, వెళ్లకుండా ఉండాల్సింది అంటుంది.
బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక నా లైఫ్ మారింది, కానీ చాలామంది నన్ను ట్రోల్ చేశారు. నేను వారికి ఆన్సర్ ఇస్తే.. మరింతగా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా తిట్టిపోశారు. దానితో నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, ఆ బాధనుంచి కోలుకోవడానికి నాలుగు నెలలు పట్టింది. అదే సమయంలో కరోనా రావడం, నా భర్త బిజినెస్ పడిపోవడం ఒకేసారి జరిగాయి.
ఆ డిప్రెషన్ ఇంకా ఎక్కువైంది, కరోనా తో నా తండ్రి చనిపోయారు, అమ్మ క్యాన్సర్ బారిన పడడంతో తట్టుకోలేకపోయాను, టివి షోస్ అవకాశాలు వచ్చిన వెళ్లలేదు, మళ్లీ ఇప్పుడు బుల్లితెర పై అవకాశాలొస్తున్నాయి. సీరియల్స్ తో మీ ముందుకు రాబోతున్నాను అంటూ శిల్ప చక్రవర్తి తన రీ ఎంట్రీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.