ప్రస్తుతం సౌత్ సినీ పరిశ్రమలో అత్యంత వేగంగా ఎదుగుతున్న యంగ్ హీరోయిన్‌గా శ్రీలీల నిలుస్తోంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెరంగేట్రం చేసిన ఆమె తెలుగులో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటూ కెరీర్ పరంగా బిజీగా ఉంది. త్వరలో శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా శ్రీలీల సినిమాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకేసారి పది సినిమాలకు అంగీకరించిన శ్రీలీల ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడుతోంది. ఈ కారణంగా ఆమె ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకునే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అదే పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతో శ్రీలీల కొత్త సినిమాల షెడ్యూల్‌కి ఆటంకం ఏర్పడిందని సమాచారం.
ప్రాజెక్ట్ మొదటికన్నా చాలా ఆలస్యం కావడం, షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందనే క్లారిటీ లేకపోవడంతో శ్రీలీల సినిమాను వదులుకోవాలని భావిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆమె ఇప్పటికే ఈ చిత్రానికి కాల్షీట్లు ఇచ్చినా మరింత ఆలస్యం అయితే ఇతర కమిట్మెంట్స్‌కు ఇబ్బంది కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.