పొత్తు పెట్టుకోకపోతే ఈసారి టీడీపీ కి మైనస్ అయ్యేదో లేదంటే టీడీపీ స్టామినా చూపించేదో తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్ జనసేన, బిజెపితో పొత్తు పెట్టుకోవడం మాత్రం టీడీపీ కి కలిసొచ్చింది. గౌండ్ రిపోర్ట్ చూసే చంద్రబాబు పొత్తుకు ఒప్పుకున్నారనేది సత్యం, పొత్తు పెట్టుకున్నారు గెలిచారు, అలాగని తనకన్నా తక్కువ సీట్లు ఉన్న జనసేనాని చిన్న చూపు చూడలేదు. ప్రతి విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు సముచిత స్తానం ఇస్తూ వచ్చారు.
పవన్ కళ్యాణ్ కూడా అవకాశం ఉన్నప్పుడల్లా చంద్రబాబు మీద అభిమానం చూపిస్తున్నారు. అటు లోకేష్, ఇటు చంద్రబాబు ఇద్దరూ పవన్ కళ్యాణ్ ను ఎక్కడా తక్కువ చేయడం లేదు. మరి పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నా అటు జనసేన నేతలు, కార్యకర్తలు వీళ్లంతా టీడీపీ వాళ్లంటే గిట్టడం లేదు. గెలిచాము, పవన్ కళ్యాణ్ డిప్యూటీ హోదాలో అధికారంలో ఉన్నారు. ప్రస్తుతం పవన్ గ్రాఫ్, జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది. అటు కేంద్రంలోను పవన్ ప్రాధాన్యత ఎక్కువైంది.
దానితో జనసైనికుల్లోనే కాదు ఇటు పవన్ కళ్యాణ్ లోను ఆత్మవిశ్వం పెరిగింది. నెక్స్ట్ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడినా గెలుస్తామనే ధీమా పెరిగింది. అదే జనసేన ఫార్మేషన్ డే రోజున పవన్ స్పీచ్ కనిపించింది, పవన్ కళ్యాణ్ ఎవరి హెల్ప్ లేకుండా జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది అని మట్లాడడం చూసిన వారు బాబు ఇప్పటినుంచి జాగ్రత్తపడితే మంచిది, లేదంటే 2029 నాటికీ పవన్ శక్తి ముందు ఇబ్బంది పడాల్సిందే అంటూ సలహాలిస్తున్నారు.
మరి చంద్రబాబు రాజకీయం ముందు పవన్ ఎంత చిన్నవాడైనా, ప్రస్తుతం వైసీపీ, టీడీపీ కి ప్రత్యామ్నాయంగా జనసేన అని ఒక్కసారి ప్రజలు అనుకుంటే మాత్రం ఇక టీడీపీ కోలుకోవడం కష్టమే. అందుకే చంద్రబాబు పవన్ విషయంలో జాగ్రత్తపడాలని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.