సమంత కొద్దిరోజుల క్రితం తను మాయోసైటిస్ వ్యాధి బారిన పడి కోలుకుంటున్నట్లుగా ఆసుపత్రి బెడ్ పై ఉన్న పిక్ అందరికి షేర్ చేసింది. ఆ తర్వాత ఆమె నటించిన యశోద మూవీ ప్రమోషన్స్ లోను సెలైన్ బాటిల్ తో సినిమా ని ప్రమోట్ చేసింది. ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఆమె సినిమా షూటింగ్ కి బిగ్ బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు కోలుకుని ఆమె షూటింగ్ లలో పాల్గొంటుంది.
సమంత రీసెంట్ గా నిర్మాతగానూ మారింది. సమంత కొన్నాళ్లుగా గ్లామర్ ఫోటోషూట్స్ తో తనకు తానే పోటీపడుతోంది. ఇలా ఉషారుగా ఉన్న సమయంలో సమంత తన ఇన్స్టా లో హాస్పిటల్ బెడ్ పై సెలైన్ పెట్టించుకున్న పిక్ షేర్ చేసింది. దానితో సమంతకు ఏమైందో ఏమో అని ఆమె అభిమానులు తెగ ఆదుర్దాపడిపోతున్నారు.
సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ సందేశం నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ ఇన్స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సముద్రంలో కలవాల్సిన నది ఎప్పటికీ దాని దిశను మార్చుకుని వెనక్కు వెళ్లలేదు అంటూ క్యాప్షన్ పెట్టడంతో సమంత అనారోగ్యం పూర్తిగా నయం కాలేదు, కానీ ఆమె దానిని ఎదుర్కుంటూ తన పని తను చేసుకుపోతుంది అనేలా దాని అర్ధం ఉంది అంటున్నారు.