యంగ్ టైగర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కలయికలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హిందీలో యష్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్న వార్ 2 చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లోకి వచ్చేసింది. ఈమధ్యన హృతిక్ రోషన్ కి వార్ 2 షూటింగ్ లొ గాయమవడం, రీసెంట్ గా అయాన్ ముఖర్జీ ఇంట్లో విషాదం తో వార్2 వాయిదా పడొచ్చనే ఊహాగానాలకు చెక్ పెడుతూ.. రిలీజ్ డేట్ ని మరోసారి కన్ ఫర్మ్ చేసారు మేకర్స్.
ముందు చెప్పినట్టుగానే ఆగష్టు 14 నే ఎన్టీఆర్-హృతిక్ ల వార్ 2 చిత్రం పాన్ ఇండియాలో విడుదల చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. సో వార్ 2 విడుదల విషయంలో ఎలాంటి మార్పు లేదు, అనుకున్న సమయానికే ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది.
ఇక ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కంప్లీట్ చెయ్యడంతో ఆయన ప్రశాంత్ నీల్ సెట్స్ లోకి వెళ్లిపోతున్నారు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ దాదాపుగా 14 కిలోల బరువు తగ్గి సూపర్ ఫిట్ నెస్ తో ఫుల్ గా మేకోవర్ అవుతూ స్టైలిష్ లుక్ లోకి మారారు.