సుకుమార్-అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 తో చాలా క్యాజువల్ గా పాన్ ఇండియాలో బిగ్ హిట్ కొట్టడమే కాదు, పుష్ప1 లోని నటనకు గాను అల్లు అర్జున్ కు నేషనల్ పుష్ప 2 పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గ కంటెంట్ తోనే పుష్ప 2 వరల్డ్ వైడ్ గా 1800 కోట్ల మార్క్ టచ్ చేసింది. దానితో అల్లు అర్జున్ రేంజ్ మరింతగా పెరిగిపోయింది.
మరి పుష్ప 2 కి సీక్వెల్ పుష్ప3 ఉంటుంది అని సుకుమార్ ప్రకటించినా అల్లు అర్జున్ మాత్రం ఇప్పట్లో పుష్ప 3 పైకి వచ్చే ఛాన్స్ లేదు, ఆయనకు సుకుమార్ మేకింగ్ పై కాస్త అలసట అనిపించడంతో అల్లు అర్జున్ అట్లీ తో తన తదుపరి ప్రాజెక్ట్ లోకి వెళ్లబోతుండడం, త్రివిక్రమ్ తో మరో మూవీ కమిట్మెంట్ ఇవ్వడంతో పుష్ప 3ని అందరూ మర్చిపోయారు.
కానీ సడన్ గా విజయవాడలో రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో మైత్రి నిర్మాత ఒకరు పుష్ప 2028 లో రిలీజ్ ఉంటుంది, ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమా చేస్తారు బన్నీ అని పుష్ప 3 పై మైత్రి నిర్మాత రవి ఇచ్చిన బిగ్ అప్ డేట్ తో అల్లు అభిమానులు తెగ ఎగ్జైట్ అవుతున్నారు.