శుభం చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్న సమంత తెలుగు రీ-ఎంట్రీ పై విపరీతమైన సస్పెన్స్ నడుస్తుంది. సమంత కొన్నాళ్లుగా తెలుగు చిత్రాలవైపు రావడం లేదు. దానితో తెలుగు ప్రేక్షకులు ఆమెను మరిచిపోతున్నారేమో అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం సమంత హైదరాబాద్ ని వదిలి ముంబైలోనే ఉంటుంది.
అక్కడే వెబ్ సీరీస్ లు చేసుకుంటూ ఇటు నిర్మాతగా సినిమాలను నిర్మిస్తోంది. అయితే కొన్నాళ్లుగా సమంత రాజ్ అండ్ డీకే లలో రాజ్ తో ప్రేమాయణం నడుపుతుంది. రాజ్ తో డేటింగ్ లో ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి సమంత చేష్టలే కారణం. రాజ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. పార్టీలకు, స్పోర్ట్స్ కి రాజ్ చేయిపట్టుకుని సమంత కనిపించడమే అందరిలో అన్ని అనుమానాలకు కారణమైంది.
ఈమధ్యనే ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్ కు కూడా రాజ్ నిడుమోరు, సమంత కలిసి హాజరవడం సంచలనం కలిగిస్తోంది. దానితో సమంత, రాజ్ తో డేటింగ్ చేస్తుంది అనే వార్తలకు బలం చేకూరింది. అది చూసి నిజమా సమంత ఇదంతా అంటూ ఆమె అభిమానులే మాట్లాడుకుంటున్నారు.