Advertisementt

RC 16 లో చాలా గేమ్స్ ఉన్నాయ్

Sun 16th Mar 2025 10:38 AM
rc 16  RC 16 లో చాలా గేమ్స్ ఉన్నాయ్
Crazy update on RC 16 RC 16 లో చాలా గేమ్స్ ఉన్నాయ్
Advertisement
Ads by CJ

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న చిత్రం RC 16(వర్కింగ్ టైటిల్). ఈచిత్రంలో రామ్ చరణ్ రగఢ్ లుక్ లో మాస్ గా కనిపించనున్నారని ఆయన బయట కనిపిస్తున్న లుక్ చెప్పకనే చెబుతుంది. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఏదో ఒక క్రీడకి పరిమితం చెయ్యడం లేదట బుచ్చిబాబు. 

స్పోర్ట్స్ డ్రామాలు అనేసరికి ఏదో ఒక ఆట చుట్టూ తిరుగుతుంటాయి. కానీ RC 16 లో మాత్రం క్రికెట్, కుస్తీ, క‌బ‌డ్డీ.. ఇలా అన్ని ర‌కాల ఆట‌లూ ఉంటాయి. అన్నిటిలో రామ్ చరణ్ ఆట‌ కూలీగా  క‌నిపించ‌బోతున్నాడు అని తెలుస్తోంది. కోచ్ పాత్ర‌లో కన్నడ స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్ కనిపించబోతున్నట్లుగా టాక్ వినబడుతుంది. 

జాన్వీ కపూర్ రామ్ చరణ్ పాత్రని కవ్వించే పాత్రలో కనిపిస్తుంది అని, జగపతి బాబు మరో కీలక పాత్రలో కనిపిస్తారట. ప్రస్తుతం RC 16 షూటింగ్ హైదరాబాద్ బూత్ బంగ్లా లో గత నెల రోజులుగా నైట్ షూట్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. 

Crazy update on RC 16 :

 RC 16 shooting update 

Tags:   RC 16
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ