ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహ్మాన్ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం ఉదయం చాతి నొప్పితో 7:30 గంటల ప్రాంతంలో ఆయన్ని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తీసుకురాగా.. అక్కడి వైద్యులు ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ వంటి పరీక్షలు చేశారు.
ప్రస్తుతం రెహ్మాన్ కు వైద్యులు ఐసీయూ చికిత్స అందిస్తున్నారు. వైద్యుల బృందం రెహ్మాన్ ను నిశితంగా పరిశీలిస్తున్నారు. రెహ్మాన్ ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రెహ్మాన్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసి మ్యూజిక్ లవర్స్, ఆయన అభిమానులు అందోళన పడుతున్నారు.