జనసేన ఫర్మేషన్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయన స్పీచ్ ఎంత పవర్ ఫుల్ గా ఉందొ, ఆయన స్టైలిష్ లుక్స్ అభిమానులను అంతే ఇంప్రెస్స్ చేసాయి. గతంలో నా శరీరంపై రాళ్లు పగలగొట్టించుకున్న సమయంలో చాలా బక్కగా ఉండేవాడిని, అయినా బలంగా ఉండేవాడిని.
నా పెద్ద కొడుకుని ఎలాగూ ఎత్తుకోలేను. కానీ ఇప్పుడు నా ఆరేళ్ళ కొడుకుని కూడా ఎత్తుకోలేకపోతున్నాను, అంత బలహీనంగా అయ్యాను, రాజకీయంగా బలంగా తయారవ్వాలి అంటూ పవన్ కళ్యాణ్ తన బలహీనతలు బయటపెట్టారు. ఇక అభిమానులు OG OG అంటూ అరుస్తుంటే.. ఇది పొలిటికల్ సభ, ఇక్కడ OG అని అరవకూడదు అంటూ చెప్పిన పవన్ కళ్యాణ్ OG చివరి చిత్రము అయ్యుండొచ్చని పవన్ మాట్లాడిన మాటలు అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
మరి OG చివరి చిత్రం అంటున్నా.. అసలు హరి హర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలును గట్టిక్కిస్తే చాలని ఆయన సినిమాల నిర్మాతలు అనుకుంటున్నారు. రెండుమూడేళ్లుగా సెట్స్ మీదున్న ఈ సినిమాలకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో తెలియక వారు తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే వీరమల్లు పదే పదే పోస్ట్ పోన్ అవుతూ మే 9 కి వెళ్ళగా మిగతా రెండు చిత్రాలు కథ అర్ధం కాకుండాపోయింది.