నటి పూజ హెగ్డే పేరు ఈమధ్యన ప్రతిరోజు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. కోలీవుడ్ మూవీస్ తో బిజీగా వున్న పూజ హెగ్డే అక్కడి హీరోలతో క్రేజీగా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. రీసెంట్ గా కూలి చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో స్పెషల్ సాంగ్ లో కాలు కదిపే అవకాశం రావడమే కాదు.. ఇప్పటికే ఆ సాంగ్ లో పూజ హెగ్డే నటించేసింది.
మరి క్రేజీ స్టార్ హీరో సూర్య తో చేస్తున్న రెట్రో చిత్రంలో పూజ హెగ్డే డీ గ్లామర్ గా కనిపించడమే కాదు తన సొంత గొంతుక వినిపించబోతుంది. మొదటిసారి తమిళంలో పూజ హెగ్డే డబ్బింగ్ చెప్పబోతోంది. మరోపక్క రాఘవ లారెన్స్ చిత్రంలో పూజ హెగ్డే ఘోస్ట్ గా కనిపించబోతుంది అనే న్యూస్.
తాజాగా హోలీ రోజున పూజ హెగ్డే రెడ్ కాస్ట్యూమ్స్ లో అద్దరగొట్టే ఫోజులతో చేయించుకున్న ఫోటోషూట్ ని వదిలింది. మెడలో డైమండ్ నెక్ లెస్ తో చెవులకు మ్యాచింగ్ జుంకీలతో పూజ హెగ్డేని రెడ్ అవుట్ ఫిట్ లో అలా చూస్తే వావ్ బ్యూటిఫుల్ అనాల్సిందే.