ఈమధ్యనే వెకేషన్స్ కి వెళ్లొచ్చిన అక్కినేని యువ హీరో నాగ చైతన్య ఆయన భార్య హీరోయిన్ శోభిత లు తాజాగా రేస్ ట్రాక్ పై కనిపించారు. నాగ చైతన్య కు రేసింగ్స్ అలాగే రేస్ కార్స్ అంటే ఎంతిష్టమో వేరే చెప్పక్కర్లేదు. తన ఫ్రెండ్స్ మరీ ఎక్కువ స్పీడుతో రేసింగ్ చేస్తే జీవితంలో ఇబ్బందిపడతావ్ అని చెప్పనప్పటి నుంచి చైతు కాస్త రేసింగ్స్ తగ్గించినట్టుగా ఓ సందర్భంలో రివీల్ చేసాడు.
తాజాగా తమిళనాడులోని చెన్నై రేసింగ్ ట్రాక్ లో చైతు కార్ రేస్ కి వెళ్ళాడు. రేస్ కార్ లో చైతు రేసింగ్ కి వెళుతుండగా శోభిత కారు దగ్గరే ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం నాగ చైతన్య-శోభితల రేసింగ్ ట్రాక్ దగ్గర దిగిన పిక్స్ వైరల్ అయ్యాయి.
ఇక డిసెంబర్ లో శోభిత ను వివాహం చేసుకున్న నాగ చైతన్య తండేల్ తో కెరీర్ లోనే బిగ్ హిట్ కొట్టాడు. అంతకుముందే మాల్దీవులు కు హనీమూన్ కి వెళ్లొచ్చిన చైతు-శోభిత ల జంట రీసెంట్ గా వెకేషన్ కి వెళ్లి సమోసాలు తినొచ్చారు. ఇప్పుడు ఆ జంట తమిళనాడులో వివాహరిస్తుంది. అందులో భాగంగా చైతూకి ఇష్టమైన రేసింగ్ పాయింట్ లో వీరు సందడి చేశారు.
ఇక పెళ్లి తర్వాత శోభిత ఈమధ్యనే తన సినిమా షూటింగ్స్ సెట్స్ కి వెళ్ళింది.