పిఠాపురంలో నిన్న జరిగిన జనసేన జయకేతనం సభలో జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీచ్ అందరిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. గత పదేళ్లలో పవన్ కళ్యాణ్ ఎంతగా రాజకీయాల్లో రాటు తేలారో అనేది ఈ జనసేన ఫార్మేషన్ సభలో స్పష్టమైంది. ఆయన జనసేన పార్టీ ఆవిర్భావం రోజున ఊగిపోతూ ఎలా అయితే స్పీచ్ ఇచ్చారో, అంతకుమించి నిన్న ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ స్పీచ్ ఉంది.
పవన్ కళ్యాణ్ పిఠాపురం స్పీచ్ చూసిన మెగాస్టార్ చిరు సోషల్ మీడియా వేదికగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తారు.
My dear brother @PawanKalyan
జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి
మంత్రముగ్ధుడినయ్యాను.సభ కొచ్చిన అశేష
జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది.
ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తి తో
నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు ! 💐అంటూ చిరు ట్వీట్ చేసారు.