2024 ఎన్నికల ముందు నుంచే వైసీపీ నేతగా ఉన్న బాలినేని జగన్ పై ఉన్న అసమ్మతి కారణముగా వైసీపీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోగానే బాలినేని ఆచి తూచి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో చేరిపోయారు.
ఆతర్వాత జనసేన పార్టీలో సైలెంట్ గా ఉంటున్న బాలినేని నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున జగన్ మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. అది మాములుగా కాదు, నా ఆస్తిలో సగం, నా వియ్యంకుడు ఆస్తిలో సగం జగన్ మోహన్ రెడ్డి కాజేసాడు అంటూ జగన్ పై బాలినేని విరుచుకుపడ్డారు.
జగన్ తనని మోసం చేసాడు, తనని అవమానించాడు అంటూ బాలినేని జనసేన సభలో కన్నీళ్లతో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.