రీసెంట్ గా మిల్కి బ్యూటీ తమన్నా ప్రియుడు విజయ్ వర్మ తో విడిపోయింది అనే వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. కొన్నాళ్లుగా తమన్నా-విజయ్ వర్మ కలిసి కనిపించకపోయేసరికి వీరి నడుమ బ్రేకప్ అయ్యింది, అందుకే కలిసి కనిపించడం లేదు అని అందరూ అనుకోవడమే కాదు, తమన్నా సోషల్ మీడియా పోస్ట్ లు ఈ బ్రేకప్ న్యూస్ లకు బలాన్ని చేకూర్చాయి.
ఈ నేపథ్యంలో తమన్నా-విజయ్ వర్మ కలిసి హోలీ సెలెబ్రేషన్స్ లో సందడి చెయ్యడం అందరికి షాకిచ్చింది. రవీనా టాండన్ ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో తమన్నా, విజయ్ వర్మ పాల్గొన్నారు. కలిసి కాదనుకోండి. తమన్నా, విజయ్ వర్మ విడివిడిగా రవీనా హోలీ వేడుకల కోసం రావడం, అక్కడ ఫోటోలకు ఫోజులివ్వడం విశేషం.
బ్రేకప్ రూమర్స్ నడుమ తమన్నా-విజయ్ వర్మ కలిసి రాకపోయినా, ఒకే వేడుకలో పాల్గొనడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.