300 కోట్ల మార్క్ కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన వెంకటేష్-అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కుటుంబ కథా చిత్రంగా ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అయ్యింది. జనవరి 14 న విడుదలైన ఈ చిత్రం ఈ ఏడాది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఎప్పుడో రిలీజ్ అయిన ఈచిత్రం ఇప్పటికి వార్తలో వినిపిస్తూనే ఉంది.
జనవరి 14 న థియేటర్స్ లో విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఎనిమిదివారాల గ్యాప్ తో అంటే మార్చి 1 న అటు ఓటీటీలోకి, ఇటు బుల్లితెర మీదకి ఒకేసారి అడుగుపెట్టింది. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ చిత్రం కోసం ఓటీటీ ఆడియన్స్, బుల్లితెర ఆడియన్స్ చాలా వెయిట్ చేసారు. మార్చి 1 సాయంత్రం జీ తెలుగు నుంచి టీవీ లో సందడి చేసింది. అదే రోజు సాయంత్రం జీ 5 ఓటీటీ హ్యాండిల్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
జీ 5 లో రికార్డ్ వ్యూస్ గా.. ఇపుడు బుల్లితెర మీద అదిరిపోయే టిఆర్పి ని సొంతం చేసుకుంది. సంక్రాంతికి వస్తున్నాం ఏకంగా 18.1 టిఆర్పి సాధించి ఔరా అనిపించేసింది. మరి థియేటర్స్ లోనే కాదు అటు బుల్లితెర మీద ఇటు ఓటీటీలోనూ సంక్రాంతికి వస్తున్నాం దుమ్మురేపింది అనే చెప్పాలి.