Advertisementt

వచ్చే నెలలో రాజా సాబ్ టీజర్

Thu 13th Mar 2025 03:18 PM
raja saab   వచ్చే నెలలో రాజా సాబ్ టీజర్
Raja Saab teaser next month వచ్చే నెలలో రాజా సాబ్ టీజర్
Advertisement
Ads by CJ

ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాకపోయినా టీమ్ మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. కొన్ని పాటల షూటింగ్ మిగిలి ఉండగా ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ చిత్రంలో బిజీగా ఉండటంతో త్వరలోనే మిగతా సీన్లు పూర్తి చేయనున్నారు. సినిమా విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉన్నా వచ్చే నెలలో టీజర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసే యోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ ద్వారా సినిమా గురించి జరుగుతున్న రూమర్స్‌కు చెక్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక కథాపరంగా చూస్తే ఈ సినిమాలో అనేక ట్విస్టులు ఉండబోతున్నాయి. లీకైన సమాచారం ప్రకారం ప్రభాస్ ఇందులో డబుల్ రోల్ చేయబోతున్నాడు. చిత్రబృందం అధికారికంగా విడుదల చేసిన సిగరెట్ తాగే పోస్టర్ లో కనిపించిన పాత్ర ఠాగూర్ పాత్ర అని మరోకటి యంగ్ ప్రభాస్ పాత్ర అని సమాచారం. వీరిద్దరి మధ్య తండ్రి కొడుకు సంబంధం ఉండొచ్చని అలాగే ఈ కథలో సంజయ్ దత్ తాత పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురి మధ్య జరిగే ఆసక్తికరమైన హారర్ డ్రామానే ది రాజా సాబ్ కు కీలక హైలైట్ అవుతుందని టాక్.

టీజర్ విషయానికి వస్తే ఇందులో ఈ డబుల్ రోల్ మిస్టరీకి సంబంధించిన చిన్న చిన్న క్లూస్ లు చూపించే అవకాశం ఉంది. అలాగే కథలో కీలకమైన నిధి అగర్వాల్ మాళవిక మోహనన్ పాత్రల మలుపులు ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నాయట. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మూడు మాస్ సాంగ్స్ ఉంటాయని అవి మిర్చి కాలం నాటి ప్రభాస్ ఎనర్జీని గుర్తు చేసేలా ఉంటాయని అంటున్నారు.

ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న కారణంగా మేకర్స్ సోలో డేట్ కోసం చూస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనేది వచ్చే నెల టీజర్ వేడుకలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Raja Saab teaser next month:

Raja Saab movie update 

Tags:   RAJA SAAB
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ