అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత సెట్స్ లోకి వెళ్లబోతున్నాడు. మార్చ్ 14 నుంచి అంటే రేపటి నుంచి అఖిల్ సెట్స్ లోకి వెళ్ళబోతున్నాడనే వార్త అక్కినేని అభిమానులను ఎగ్జైట్ అవుతున్నారు. వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు నందు తో అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు, అఫీషియల్ అనౌన్సమెంట్ రాకపోయినా అఖిల్ సెట్స్ మీదకి వెళ్లబోతున్నాడు.
ఈ చిత్రానికి లెనిన్ అనే టైటిల్ అఖిల్-నందు కాంబో మూవీ పెట్టబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. షూటింగ్ మొదలు పెట్టడమే తొలి షెడ్యూల్‌ను ఏకధాటిగా 20 రోజుల పాటు చిత్రీకరించనున్నారని, మొదటి షెడ్యూల్ లోనే చాలా వరకు షూటింగ్ పూర్తవుతుందని, హైదరాబాద్ లోనే 50 శాతం షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తోంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఫారిన్ లొకేషన్లకు ప్రాధాన్యత లేకుండా లోకల్ లోనే ఈ సినిమాను రూపొందించనున్నారని తెలుస్తోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో నందు అఖిల్ లెనిన్ (వర్కింగ్ టైటిల్) ని తెరకెక్కించబోతున్నారని అని తెలుస్తుంది. ఈ చిత్రం లో అఖిల్ కి జోడిగా శ్రీలీల ను అనుకుంటున్నట్లుగా సమాచారం.