తనకు నచ్చిన కథలను ఎంచుకుంటూ, ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయ్యే పాత్రలతో మెస్మరైజ్ చేస్తున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి రీసెంట్ గా కోలీవుడ్ లో అమరన్ తో పాటుగా తెలుగులో తండేల్ తో బిగ్ హిట్ అందుకుంటుంది. రెండు సినిమాల్లో సాయి పల్లవి చేసిన పాత్రలు అన్ని వర్గాల ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాయి.
ప్రస్తుతం సాయి పల్లవి సౌత్ సినిమాల కన్నా ఈమధ్యన హిందీ ఫిలిమ్స్ తో బిజీ అయ్యింది. గ్లామర్ కు దూరంగా పెరఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రలకు దగ్గరగా తన నటనతో ప్రత్యేకతను చాటుతున్న సాయి పల్లవి కోసం దర్శకనిర్మాతలు హీరోయిన్ సెంట్రిక్ కథలను రెడీ చేసేస్తున్నారు. టాప్ హీరోయిన్స్ కేవలం కమర్షియల్ ఫిలిమ్స్ కే పరిమితమవుతున్నారు.
వారు ఆ సినిమాల్లో కేవలం ఒకటి రెండు సీన్స్ కు, నాలుగైదు పాటలకు పరిమితమవుతున్నారు. సాయి పల్లవి అలాంటి వాటికి ఎప్పటికి దూరం. ఈమధ్యన టాప్ హీరోయిన్స్ కి, గ్లామర్ గర్ల్స్ కి లేని డిమాండ్ సాయి పల్లవి కి వచ్చేసింది. ఆమె సౌత్ సినిమాల డేట్స్ కోసం ఇక్కడ దర్శకులు వెయిటింగ్.
మరి సాయి పల్లవి నటనకు బాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిస్తే కష్టమే. ఆమె అక్కడే బిజీ అయ్యి సౌత్ కి దూరమయ్యే అవకాశము లేకపోలేదు.