Advertisementt

శ్రీలీల ఇంత ఫాస్ట్ గానా..

Thu 13th Mar 2025 11:44 AM
kartik aaryan  శ్రీలీల ఇంత ఫాస్ట్ గానా..
Kartik Aaryan and Sreeleela romance buzz శ్రీలీల ఇంత ఫాస్ట్ గానా..
Advertisement
Ads by CJ

సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన శ్రీలీల ప్రస్తుతం హిందీలో హడావిడి మొదలు పెట్టింది. కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల అప్పుడే ప్రేమలో పడిందా, అది కూడా కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల డేటింగ్ చేస్తుందా, ఇప్పుడు ఇదే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చక్కర్లు కొడుతున్న వార్త. 

అందుకే శ్రీలీల కార్తీక్ ఆర్యన్ ఇంటి ఫంక్షన్ లో అంత క్లోజ్ గా డాన్స్ చేసింది. శ్రీలీల -కార్తీక్ ఆర్యన్ నడుమ ఏం జరుగుతుందో అంటూ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో కార్తీక్ ఆర్యన్ తల్లి చేసిన కామెంట్స్ అందరిలో అనుమానాలు వ్యక్తమయ్యేలా చేసింది. కార్తిక్ తల్లి ఐఫా వేడుకల్లో భాగంగా తమ ఇంటికి ఎటువంటి అమ్మాయి కోడలిగా రావాలన్న విషయాన్ని తెలియజేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

ఒక మంచి డాక్టర్ అమ్మాయి​ మా ఇంటికి కోడలిగా రావాలని మేమంతా కోరుకుంటున్నాం అంటూ మాట్లాడడం, శ్రీలీల కూడా డాక్టర్ చదవడంతో అందరూ శ్రీలీల ను కార్తీక్ ఆర్యన్ కు కాబోయే వైఫ్ అయ్యుంటుంది, అందుకే కార్తీక్ తల్లి అలాంటి కామెంట్స్ చేసింది అంటూ మాట్లాడుకుంటున్నారు. అది విని శ్రీలీల ఇంత ఫస్ట్ గా మూవ్ అయ్యిందా అంటూ షాకవుతున్నారు. 

Kartik Aaryan and Sreeleela romance buzz:

Kartik Aaryan is rumored to be dating Sreeleela

Tags:   KARTIK AARYAN
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ