నటుడు పోసాని కృష్ణ మురళి గత 15 రోజులుగా జైలులో ఉన్నారు, బెయిల్ కోసం వెయిట్ చేస్తున్న ఆయన్ని ఏపీ పోలీసులు పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిప్పుతున్నారు. 17 కేసుల్లో పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చినా ఆయనను చివరి నిమిషంలో గుంటూరు పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకోవడంతో ఆయనను గుంటూరు జిల్లా కోర్టుకు తరలించారు.
అయితే కోర్టులో జెడ్జి ఎదుట పోసాని కన్నీరుమున్నీరు అయ్యారు. పోసాని తరుపున వాదనలు వినిపించిన వైసీపీ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పోసాని కృష్ణమురళిపై వ్యక్తిగత కోపంతో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదు ఇది కక్ష పూర్త చర్య అంటూ.. జడ్జి సమక్షంలో పొన్నవోలు వాదనలు వినిపించగా.. పోసాని మాత్రం కన్నీరు పెట్టుకున్నారు. తప్పు చేస్తే తనని నరికెయ్యమని, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నాకు రెండు ఆపరేషన్లు చేసి స్టంట్ లు వేశారు. నాకు భార్యాబిడ్డలు ఉన్నారు. రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యమని జడ్జి ఎదుటే కన్నీళ్లు పెట్టుకున్న పోసాని కృష్ణమురళి.