2024 ఎలెక్షన్ లో వైసీపీ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాలు బ్లూ మీడియా వెలికి వెలికి తీసింది. వైసీపీ కార్యకర్తలను జగన్ పట్టించుకోకుండా వాలంటీర్ వ్యవస్థను నమ్మడం, అలాగే ఎమ్యెల్యేలను, మంత్రులను కలవకుండా కోటరీ చాటున జగన్ ఉండడమే జగన్ వైసీపీ పార్టీని మళ్లీ అధికారంలోకి తేలేకపోయారని బ్లూ మీడియానే చాటి చెప్పింది.
జగన్ చుట్టు ధనుంజయ్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు చేరి కింది స్థాయి సమస్యల గురించి, కార్యకర్తల గురించి జగన్ కు తెలియకుండా చేసి, జగన్ పై రాష్ట్ర ప్రజల్లో వస్తున్న వ్యతిరేఖతను కనబడకుండా చేసి జగన్ ఓటమికి కారణమయ్యారని బ్లూ మీడియా నొక్కి వక్కానించింది. జగన్ కు అత్యంత విధేయుడు, జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకునే వ్యక్తి విజయసాయి రెడ్డి కూడా జగన్ చుట్టూ చేరిన కోటరీ పై చేసిన కామెంట్స్ చూస్తే బ్లూ మీడియా చెప్పింది నిజమే అంటున్నారు.
వైసీపీ పార్టీకే కాదు, రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయి రెడ్డి వైసీపీ అధినేత జగన్ పై సన్సెషనల్ కామెంట్స్ చేసారు. జగన్ ను కలవాలంటే ముందు కోటరీని దాటాలి, జగన్ తో నన్ను కూడా కలవనియ్యలేదు, మా నాయకుడు చెప్పినట్లు నేను విధేయంగా లేకో, నమ్మకంలేకో, భయంతోనో, ప్రలోభాలకు గురయ్యో పార్టీకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పలేదు.
వైసీపీ లో నాకు జరిగిన అవమానాలు మరెవ్వరికీ జరగలేదు, అంతగా అవమాన పడ్డాను, నా గుండె ముక్కలయ్యింది, జగన్ ను కలిసి చెప్పుకుందామన్నా జగన్ చుట్టూ చేరిన వారు నన్ను జగన్ ను కలవనియ్యలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. మరి ఇది విన్నాక అయినా జగన్ కళ్ళు తెరిచి కోటరీ నుంచి బయటికి వస్తారో, లేదో అని వైసీపీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు.