తానే సినిమా మొదలు పెట్టినా అది మీడియాకి అనౌన్స్ చేసి మరీ సెట్స్ లోకి అడుగుపెట్టే రాజమౌళి మహేష్ బాబు తో చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం SSMB 29 విషయంలో ఏంతో సీక్రెట్ గా హైప్ చేస్తూ జాగ్రత్తలు తీసుకోవడం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని ఎక్కువ చేస్తుంది. అందుకే రాజమౌళి సినిమాపై ఏ న్యూస్ వినిపించినా, ఏ పిక్ కనిపించినా వెంటనే వైరల్ చేస్తున్నారు.
రాజమౌళి ప్రియాంక చోప్రా విషయం కానీ, పృథ్వీ రాజ్ విషయం కానీ ఎక్కడా రివీల్ చెయ్యలేదు. కానీ ఎవరో ఒకరు వారి పేర్లను బయటపెట్టేసారు. అదే రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే అద్దిరిపోయేది. కానీ రాజమౌళి ఎంతగా సీక్రెట్ ని మైంటైన్ చేస్తున్నారో అంతగా SSMB 29 లీక్స్ రచ్చ చేస్తున్నాయి.
రాజమౌళి ఈ ప్రాజెక్ట్ విషయంలో తీసుకుంటున్న అతి జాగ్రత్తల వలనే ఇదంతా జరుగుతుంది అనే వార్తలు వినవస్తున్నాయి. అదేదో అధికారికంగా మహేష్ మూవీపై ఓ ఎనౌన్సమెంట్ ఇచ్చేస్తే ఫ్యాన్స్, ప్రేక్షకులు కూలవుతారు. ఇలాంటి లీకులొచ్చినా అడ్డుకట్ట వేస్తారు. లేదంటే ఇలాంటి లీకులు ఆపడం ఎవ్వరి తరము కాదు.