హీరోయిన్ గా ఓ వెలుగు వెలగకపోయినా.. పేరున్న సినిమాల్లో నటించి ఈషా రెబ్బ నటిగా ప్రూవ్ చేసుకున్నప్పటికి, ఆమెకు బ్రేకిచ్చే చిత్రం మాత్రం తగల్లేదు. సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా గ్లామర్ షూట్స్ తో మెస్మరైజ్ చేస్తున్న ఈ తెలుగందం, తాజాగా వదిలిన పిక్స్ చూసి వావ్ బ్యూటిఫుల్ అనాల్సిందే.
ఎక్కువగా ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించే ఈషా రెబ్బ గ్లామర్ షో శృతి మించకపోయినా.. కొన్నాళ్లుగా అందాలు ఆరబోసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు ఫ్రెష్ లుక్స్ షేర్ చేస్తూ యూత్ ని ఆకర్షిస్తుంది. తాజాగా ఈషా రెబ్బ మోడ్రెన్ వేర్ లోను పద్దతిగా కనిపించింది.
హద్దులు దాటని అందంతో బ్యూటిఫుల్ లుక్స్ తో కనిపించే ఈషా రెబ్బ కు అద్భుతమైన అవకాశాలు తగలాలని ఆశిద్దాం. ఆమె ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా అలాగే దయ వెబ్ సీరీస్ సీక్వెల్లో నటిస్తుంది.