దర్శకధీరుడు రాజమౌళి ఎంతో పకడ్బందీగా మహేష్ తో చేస్తున్న చిత్ర స్క్రిప్ట్ ని లాక్ చేసి సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టడమే కాదు, సెట్ లోని హీరో-హీరోయిన్స్ దగ్గరనుంచి నటులు, టెక్నీకల్ టీమ్ వరకు ఫోన్స్ లాక్కుని ఏ విషయము బయటికి పొక్కకుండా షూటింగ్ చేసుకుంటున్న రాజమౌళికి లీకేజి రాయుళ్లు ఝలక్ ఇవ్వడం మాములు విషయం కాదు.
అవుట్ డోర్ లో మహేష్ సీన్స్ లీక్ చేసి వైరల్ చెయ్యడం రాజమౌళి కి బిగ్ షాకే ఇచ్చింది. రాజమౌళి మహేష్ తో తీస్తున్న సన్నివేశాలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కారు లో నుంచి షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేసారు. అది కాస్త క్షణాల్లో వైరల్ అయ్యింది. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ అడ్వాంచరస్ ఫిలిం ని రాజమౌళి ఎంతో కష్టపడి చిత్రీకరణ చేస్తే ఎలాంటి జాలి, దయ లేని వారు లీక్ చెయ్యడం కరెక్ట్ కాదనే వాదన వినిపించినా దానిని ఆపడం ఎవ్వరి తరం కావడం లేదు.
అందుకే రాజమౌళి SSMB 29 షూటింగ్ పరిసర ప్రాంతాల్లో టైట్ సెక్యూరిటీ చెయ్యడమే కాదు సెక్యూరిటీని ఇంకా పెంచేశారని తెలుస్తుంది. ఒడిశా షెడ్యూల్ లో మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ లు పాల్గొంటున్నారు.