ప్రస్తుతం SSMB29 షూటింగ్ ని దర్శకధీరుడు రాజమౌళి ఒడిశాలో చిత్రీకరిస్తున్నారు. మహేష్ అలాగే ఈ చిత్రంలో నటిస్తున్న ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ లు SSMB 29 షూటింగ్ లో పాల్గొంటున్నారు. నిన్న సోమవారమే ప్రియాంక SSMB 29 కోసం ఒడిశా వెళ్లగా అక్కడ ఆమెకు ఒడిశా ఎయిర్ పోర్ట్ లో అద్భుతమైన వెల్ కమ్ దక్కింది.
అయితే రీసెంట్ గా SSMB 29 నుంచి మహేష్ సీన్ వీడియో ఒకటి లీకై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ వీడియో బయటికొచ్చాక SSMB 29 స్టోరీపై రకరాల కథనాలు బయటికొచ్చేశాయి. అడ్వాంచరస్ ఫిలిం గా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈచిత్రం తెరకెక్కుతుంది అన్నారు. తాజాగా మహేష్ పాత్ర ప్రయాణం కాశి నుంచి మొదలై అడవుల వరకు వెళ్లడమే కాదు దానికోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లో మణికర్ణికా ఘాట్ తో పాటు కాశి పరిసరాలను ప్రత్యేకంగా సెట్ రూపంలో నిర్మిస్తున్నారు.
దానికి సంబంధించిన విజువల్స్ కూడా లీకయ్యాయి. SSMB 29 లో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆ పవిత్ర పుణ్యక్షేత్రం బ్యాక్ డ్రాప్ లోనే డిజైన్ చేశారని వినికిడి. రైటర్ విజయేంద్ర ప్రసాద్ రామాయణంలో హనుమాన్ నేపధ్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని SSMB 29 కథ అల్లారని టాక్.