జెప్టో యాడ్ లో ఎన్టీఆర్ హెయిర్ స్టయిల్, ఆయన లుక్ చూసి చాలామంది ట్రోల్ చెయ్యడం, అది చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన పడడం చూసాం. ఎన్టీఆర్ 14 కేజీల వెయిట్ తగ్గి ఫేస్ లో కాస్త గ్లో తగ్గిన ఫీలింగ్ తో పాటుగా హెయిర్ స్టయిల్ చూసి కంగారు పడ్డారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ చూసి ఫ్యాన్స్ కూల్ అవుతున్నారు.
తాజాగా ఎన్టీఆర్ ముంబై ఎయిర్ పోర్టు లో కనిపించారు. బరువు తగ్గినప్పటికీ హ్యాండ్ సమ్ గా కనిపించేసరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. ఎన్టీఆర్ ఎంత సాదా సీదాగా ఉన్నా ఆయన స్టయిలింగ్ లుక్ తెగ నచ్చేస్తుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్ ఫినిష్ చెయ్యాలనే కసితో ఉండగా.. స్పెషల్ సాంగ్ చిత్రీకరణలో హృతిక్ గాయం పాలవడంతో ప్రస్తుతం వార్ 2 షూటింగ్ వాయిదాపడినట్లుగా తెలుస్తోంది.
ఇక ఇక్కడ హైదరాబాద్ లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ స్టార్ట్ చేసేసారు, త్వరలోనే ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ సెట్ లో జాయిన్ అవుతారు. ఈ చిత్రం కోసమే ఎన్టీఆర్ 14 కేజీల వరువు తగ్గి మేకోవర్ అవుతున్నారు.