మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నైట్ షిఫ్ట్ లు చేస్తున్నారు. గత 27 రోజులుగా చరణ్ బ్రేక్ లేకుండా నైట్ షూట్ లో పాల్గొంటున్నారు. బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న RC 16(వర్కింగ్ టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. నైట్ ఎఫెక్ట్స్ తో ఈ భారీ షెడ్యూల్ ని చిత్రీకరణ చేస్తుండడంతో రామ్ చరణ్ నైట్ షూటింగ్ కి హాజరవుతున్నారు.
రీసెంట్ గానే రామ్ చరణ్, ఉపాసనలు ఓ ఈవెంట్ లో సందడి చేసారు, ఆ ఈవెంట్ లో చరణ్ తో మహేష్ వైఫ్ నమ్రత దిగిన పిక్స్ వైరల్ గా మారాయి. ఇక చరణ్ RC 16 షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతూ ఉండడంతో తన కుమర్తె క్లింకార తో టైమ్ స్పెండ్ చేస్తూ పెద్ది (వర్కింగ్ టైటిల్) షూటింగ్ లో పాల్గొంటున్నారు.
రామ్ చరణ్ తో జోడి కడుతున్న జాన్వీ కపూర్ కూడా RC 16 నైట్ షూట్ లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ విలన్ రోల్ ప్లే చేస్తూ ఉండగా జగపతి బాబు కీ రోల్ పోషిస్తున్నారు. ఈచిత్రానికి ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.