మార్చ్ 28 నుంచి హరి హర వీరమల్లు ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అవ్వదని నిన్నటివరకు బల్లగుద్ది నిర్మాత చెప్పినా.. ఇప్పుడు వీరమల్లు పోస్ట్ పోన్ అనివార్యమయ్యేలా కనిపిస్తుంది. మార్చ్ 28 న హరి హర వీరమల్లు వచ్చే ఛాన్స్ లేదు, అది స్పష్టమవుతుంది. ఇప్పుడు మార్చ్ 28 నుంచి పోస్ట్ పోన్ అయ్యే హరి హర వీరమల్లు కొత్త డేట్ పై ముచ్చట మొదలయ్యింది.
రాజస్థాన్ లో తియ్యబోయే షెడ్యూల్ తో వీరమల్లు షూటింగ్ ఓ కొలిక్కి వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తారో తెలియడం లేదు, అందుకే మేకర్స్ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ పవన్ దయతలచి డేట్స్ అడ్జెస్ట్ చేస్తే ఎలాగైనా సమ్మర్ హాలిడేస్ లో హరి హర వీరమల్లుని విడుదల చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
సమ్మర్ లో పెద్ద సినిమాలేవి లేకపోవడం, విశ్వంభర, రాజా సాబ్ అన్ని పోస్ట్ పోన్ మోడ్ లో ఉండడంతో హరి హర వీరమల్లు ని వేసవిలో అంటే మే లో దించాలని మేకర్స్ అనుకుంటున్నారట. మర పవన్ దయతలచాలి, లేదంటే వీరమల్లు మేకర్స్ కొత్త డేట్ అనుకుంటే సరిపోదుగా.. చూద్దాం వీరమల్లు కొత్త డేట్ ఏమిటి అనేది.