ట్రెడిషనల్ గర్ల్ రీతూ వర్మ రీసెంట్ గా మజాక చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాగా.. అది సో సో రిజల్ట్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చక్కటి కథల ఎంపికతో సినిమాలు చేస్తున్న రీతూ వర్మకు స్వాగ్, మజాకా బ్యాక్ టు బ్యాక్ షాక్ లిచ్చాయి. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు లేటెస్ట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసే రీతూ వర్మ తాజాగా తనకు కాబోయే భర్తకుండాల్సిన లక్షణాలేమిటో బయటపెట్టింది.
తాను నటిని కాబట్టి తనకు ఇండస్ట్రీ నుంచి వచ్చే వ్యక్తి వద్దంటుంది. ఇక తన కాబోయే భర్తకు చాలా దయ కలిగి ఉండాలి, అంతేకాదు నిజాయితీగా ఉండాలని, ఫేక్ పీపుల్ అంటే తనకు అస్సలు నచ్చదని చెప్పుకొచ్చింది.
జెన్యూన్ గా ఉంటే సరిపోతుందని, తనను ఎంతో బాగా చూసుకోవాలని చెప్పింది, అలాంటి వ్యక్తి దొరికితే పెళ్లిచేసుకుంటాను,పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ ని కంటిన్యూ చేస్తాను అంటూ రీతూ వర్మ తన అభిమానులతో పెళ్లి, కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు షేర్ చేసింది.