సినీ నటుడు, నిర్మాత పోసాని కృష్ణమురళి ఫైనల్ గా బెయిల్ మంజూరు అయ్యింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోసానిపై ఏపీలో పలు కేసులు నమోదు కాగా.. ఆయనను గత వారం అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. రాజంపేట జైలులో కస్టడీలో ఉన్న పోసానిని మరోసారి నర్సారావు పేట పోలీసులు అరెస్ట్ చేసారు.
పల్నాడు జిల్లా టిడిపి నేత కొట్టా కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసరావుపేట 2వ పట్టణ పొలీసులు కేసు నమోదుచేసి కోర్టు కు హాజరు పరచిన విషయం అందరికీ తెలిసిందే. ఈకేసులో వైసీపీ లీగల్ టీమ్ న్యాయవాది రాప్రోలు శ్రీనివాసరావు పోసాని తరఫున వాదనలు వినిపించగా ఈ రోజు నరసరావుపేట కోర్టు మేజిస్ట్రేట్ వారు పోసానికి బెయిల్ మంజూరు చేశారు.