Advertisementt

తనకెలాంటి అసంతృప్తి లేదంటున్న వర్మ

Mon 10th Mar 2025 04:27 PM
varma  తనకెలాంటి అసంతృప్తి లేదంటున్న వర్మ
Varma says he has no dissatisfaction తనకెలాంటి అసంతృప్తి లేదంటున్న వర్మ
Advertisement
Ads by CJ

పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని పొత్తు లో భాగంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి ఇచ్చినప్పుడు టీడీపీ నేత వర్మ చంద్రబాబు ఆజ్ఞను పాటిస్తూ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేసారు. ఆతర్వాత బాబు చెప్పారని పవన్ వెన్నంటే ఉన్నారు. మధ్యలో వర్మను చంద్రబాబు కాస్త పట్టించుకోకపోయినా ఆయన మాత్రం చంద్రబాబు మాటకే కట్టుబడి ఉన్నారు. 

కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థుల జాబితాలో వర్మ పేరు లేకపోవడంతో వర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, ఎవ్వరికి అందుబాటలోకి రావడం లేదు, ఫోన్ స్విచ్ఛాఫ్, చంద్రబాబు పై వర్మ అలకబూనారంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వర్మ ఈవార్తలపై స్పందించారు. 

అంతేకాదు పిఠాపురంలో కార్యకర్తలతో వర్మ కీలక సమావేశం నిర్వహించారు, కార్యకర్తలెవరు అధైర్యపడవద్దు, టీడీపీతో తన ప్రస్థానం 23 ఏళ్లుగా కొనసాగుతోంది, సీఎం చంద్రబాబుతో అనేక అంశాలపై పనిచేశానని,చంద్రబాబు, నారా లోకేశ్ ఆదేశాలే  తనకు, తన కుటుంబానికి శిరోధార్యమని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వర్మ పేర్కొన్నారు. 

Varma says he has no dissatisfaction:

TDP SVSN Varma Reacts After Missing Out on MLC

Tags:   VARMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ