తాను డేట్స్ ఇచ్చినా నిర్మాతలు, దర్శకులు వాడుకోలేదు అంటూ నెపం అంతా దర్శకనిర్మాతలపైకి నెట్టేసి పవన్ కళ్యాణ్ కూల్ గా కూర్చున్నారా అంటే అదీ లేదు, ఆయన రాజకీయాల వెంట పరుగులు పెడుతూ సినిమాలను పట్టించుకోకపోవడం తోనే ఆయన నటిస్తున్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియక అయోమాయంలో ఉన్నారు అభిమానులు.
మార్చ్ 28 హరి హర వీరమల్లు రిలీజ్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు మేకర్స్. కానీ ఇప్పటివరకు రిలీజ్ చాయలు లేవు. 15 రోజుల వ్యవధిలో వీరమల్లు వచ్చే ఛాన్స్ లేదు. వీరమల్లు కంప్లీట్ అయితేనే OG పట్టాలెక్కేది. OG లో పవన్ జాయిన్ అయ్యే సమయం కోసం సుజిత్ ఎదురు చూస్తున్నాడు. పవన్ రాక మరింత ఆలస్యమయ్యేలా ఉంది.
మరోపక్క OG ఈ ఏడాది విడుదలయ్యే ఛాన్స్ లేదు, ముందుగా సెప్టెంబర్ రిలీజ్ కి అనుకున్నారు కానీ పవన్ నుంచి డేట్స్ అంత త్వరగా వచ్చేలా లేకపోవడం తో వచ్చే ఏడాదికే షిఫ్ట్ అయ్యిపోతుంది అని తెలుస్తుంది. ఆ న్యూస్ చూసి పవన్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా డిజప్పాయింట్ అవుతున్నారు.