Advertisementt

ప్రణయ్ హత్య కేసులో నిందితుడికి ఉరి

Mon 10th Mar 2025 03:41 PM
pranay  ప్రణయ్ హత్య కేసులో నిందితుడికి ఉరి
Accused hanged in Pranay case ప్రణయ్ హత్య కేసులో నిందితుడికి ఉరి
Advertisement
Ads by CJ

మిర్యాలగూడ కు చెందిన ప్రణాయ్‍ హత్య కేసు అప్పట్లో ఎంతగా సంచలనం సృష్టించినదో అందరికి తెలిసిందే. అమృత-ప్రణయ్ ల ప్రేమ పెళ్లిని ఒప్పుకోని అమృత తండ్రి మారుతి రావు ప్రణయ్ ని ఓ గ్యాంగ్ కి సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించిన ఘటన సెన్సేషనల్ సృష్టించింది. ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావు A-1 కేసు విచారణ సమయంలో ఆత్యహత్య చేసుకున్న విషయం తెలిసిందే

ఈ రోజు నల్లగొండ SC -ST స్పేషల్‍ కోర్టు ప్రణయ్ హత్య కేసులో తీర్పు ఇచ్చింది. ప్రణయ్ హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన A-2  సుభాష్‍ శర్మ కు నల్లగొండ SC -ST స్పేషల్‍ కోర్టు ఉరి శిక్ష ఖరారు చేసింది. A-6 శ్రవణ్‍ కుమార్‍ ( మారుతీ రావు సోదరుడు ) తో సహా ఇతర నిందుతులకు జీవిత ఖైది శిక్ష ఖరారు చేసింది. 

ఇప్పటికే ప్రణయ్ హత్య కేసు నిందితులు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈరోజు నల్గొండ కోర్టు తీర్పు తో ప్రణయ్ తండ్రి తాము కష్టాలనెదిరించి పోరాటం చేశామని తమకు తగిన న్యాయం జరిగింది, ప్రణయ్ ను చంపి తనకు కొడుకు లేకుండా, అమృతకు భర్త లేకుండా, నా మనవడకు తండ్రి లేకుండా చేసారని ఆయన మీడియా తో మట్లాడారు. 

Accused hanged in Pranay case:

Landmark Verdict In Pranay Murder Case

Tags:   PRANAY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ