Advertisementt

ఈ వారం ఓటీటీ లో కొత్త చిత్రాలు

Mon 10th Mar 2025 03:27 PM
ott  ఈ వారం ఓటీటీ లో కొత్త చిత్రాలు
New films on OTT platforms this week ఈ వారం ఓటీటీ లో కొత్త చిత్రాలు
Advertisement
Ads by CJ

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. సోనీలివ్ లో ఏజెంట్ తెలుగు మార్చి 14న విడుదల కానుంది. అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో మంచి హైప్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

నెట్ఫ్లిక్స్ లో అమెరికన్ మ్యాన్ హంట్ అనే డాక్యుమెంటరీ సిరీస్ మార్చి 10న స్ట్రీమింగ్ అవుతుంది. అమెరికాలో సంచలనం సృష్టించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథల ఆధారంగా ఇది రూపొందించబడింది. అమెజాన్ ప్రైమ్ లో వీల్ ఆఫ్ టైమ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ మార్చి 13న విడుదల కానుంది. అలాగే హిందీ చిత్రం బీ హ్యాపీ మార్చి 14న స్ట్రీమింగ్‌కి రానుంది.

జీ5 లో ఇన్ గలియోంమే హిందీ వెబ్ సిరీస్ మార్చి 14న విడుదల కానుంది. క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఆపిల్ టీవీ ప్లస్ లో డోప్ వెబ్ సిరీస్ మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది డ్రగ్స్, మాఫియా నేపథ్యంలో రూపొందిన ఇంటెన్స్ థ్రిల్లర్.

తెలుగు ఓటీటీ ప్రేక్షకుల కోసం ఈటీవీ విన్ లో పరాక్రమం మార్చి 13న, రామం రాఘవం మార్చి 14న స్ట్రీమింగ్ కానున్నాయి. పరాక్రమం యాక్షన్ డ్రామాగా, రామం రాఘవం సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఈ వారం అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విభిన్నమైన కంటెంట్ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుండటంతో సినిమా ప్రియులకు మంచి వినోదం లభించనుంది.

New films on OTT platforms this week:

New films on OTT platforms

Tags:   OTT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ