Advertisementt

జైలర్ 2 స్టార్ట్ అయ్యింది

Mon 10th Mar 2025 11:45 AM
jailer 2  జైలర్ 2 స్టార్ట్ అయ్యింది
Jailer 2 has started జైలర్ 2 స్టార్ట్ అయ్యింది
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జైలర్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు కొనసాగింపుగా జైలర్ 2 తెరకెక్కనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ షూటింగ్ నేడు చెన్నైలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ సుమారు రెండు వారాలు కొనసాగనుండగా వచ్చే ఏప్రిల్ నెలలో మరో ముఖ్యమైన షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

జైలర్ 2లో రజినీకాంత్‌తో పాటు తమన్నా, యోగిబాబు, వినాయకన్, రమ్యకృష్ణ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. జైలర్ లో టైగర్ కా హుకూమ్ అంటూ రజినీకాంత్ తన స్టైల్‌లో ఆకట్టుకున్న విధంగా జైలర్ 2లో మరింత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం రజినీకాంత్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కూలీ షూటింగ్‌తో కూడా బిజీగా ఉన్నారు. మాస్ సినిమాలకు కొత్త హంగులు అద్దే రజినీకాంత్ జైలర్ 2 ద్వారా మరోసారి తన స్టైల్‌లో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన అభిమానులు ఈ సీక్వెల్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. త్వరలోనే సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.

Jailer 2 has started:

Latest shooting update on Rajinikanth Jailer 2

Tags:   JAILER 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ