పిఠాపురంలో టీడీపీ నేతగా మంచి పేరున్న SVSN వర్మను పొత్తు ధర్మంలో భాగంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ కోసం పక్కనపెట్టిన చంద్రబాబు పదే పదే వర్మకు అన్యాయం చేస్తున్నారు. పవన్ కోసం వర్మకు ఎమ్యెల్యే టికెట్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ కోసం పని చేయించిన చంద్రబాబు ఆ తర్వాత వర్మకు న్యాయం చేస్తాను అని సర్ది చెప్పి మాటిచ్చారు.
నామినేటెడ్ పోస్ట్ లు SVSN వర్మ కి ఇస్తారని అన్నప్పటికి చంద్రబాబు వర్మను లైట్ తీసుకున్నారు. ఇప్పుడు MLC అభ్యర్తుల లిస్టులో ఖచ్చితంగా వర్మ పేరు ఉంటుంది. చంద్రబాబు వర్మకు న్యాయం చేస్తారని అనుకుంటే.. ఇప్పుడు MLC అభ్యర్తుల లిస్టులో వర్మ పేరు లేకపోవడం ఆయనకి బిగ్ షాక్ తగిలేలా చేసింది. అప్పట్లో పవన్ కోసం SVSN వర్మ ను బలి చేసిన చంద్రబాబు, అసెంబ్లి ఎన్నికల సమయంలో పవన్ కోసం TDP నాయకుడు SVSN వర్మ సీటు త్యాగం చేయించి MLC టీకెట్ మాట ఇచ్చి బుజ్జిగించిన చంద్రబాబు.
కానీ ఇప్పుడు MLC అభ్యర్తుల లిస్టులో తన పేరు లేక పోవడంతో అలకబూనిన SVSN వర్మ, అంతేకాకుండా ఫోన్ లో ఎవరికి అందుబాటుకు లేకుండా SVSN వర్మ చంద్రబాబు కు టెన్షన్ పెడుతున్నారు. మరోపక్క చంద్రబాబు చెప్పారని పవన్ కోసం ఎమ్యెల్యే సీటు త్యాగం చేసి తప్పు చేసినట్లుగా ఫీలవుతున్నారని ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు.