Advertisementt

ఒకే వేదికపై మాజీ లవర్స్

Mon 10th Mar 2025 11:13 AM
shahid kapoor  ఒకే వేదికపై మాజీ లవర్స్
Shahid reacts to hugging and meeting Kareena ఒకే వేదికపై మాజీ లవర్స్
Advertisement
Ads by CJ

ఐఫా అవార్డ్స్ 2025 వేడుక ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వేడుకలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. అందులో ముఖ్యంగా షాహిద్ కపూర్, కరీనా కపూర్ క్లోజ్‌గా మాట్లాడుకోవడం, ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అపురూపమైన క్షణాలను అనేక మంది తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీటి ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీరిద్దరూ ఇలా కలిసి కనిపించడం సినీ అభిమానుల్లో పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తించింది.

2007లో విడుదలైన జబ్ వి మెట్ సినిమాతో షాహిద్, కరీనా ఆన్లైన్ క్యూట్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ సినిమాకు ముందే చుప్ చుప్ కే, ఫిదా, 36 చైనా టౌన్ వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య సన్నిహితత్వం పెరిగి, కొంతకాలం ప్రేమలో కూడా ఉన్నారు. కానీ 2007లో వారి సంబంధం ముగిసింది. ఆ తర్వాత చాలా కాలం పాటు సినిమాల్లో కలిసి నటించినా పబ్లిక్ ఈవెంట్స్‌లో ఒకరినొకరు తప్పించుకునే ప్రయత్నం చేశారు.

అయితే తాజాగా జరిగిన ఐఫా వేడుకలో వీరిద్దరూ ఒకే వేదికపై పక్కపక్కనే నిలబడి మాట్లాడుకున్నారు. మొదటగా కొద్దిసేపు ఇబ్బందిగా ఫీల్ అయినా తర్వాత సరదాగా నవ్వుతూ సంభాషించారు. అంతేకాదు కలిసి ఫొటోలు దిగడంతో పాటు ఆలింగనం కూడా చేసుకున్నారు. వీరి రీయూనియన్ చూసిన నెటిజన్లు జబ్ వి మెట్ సినిమాలోని ఆదిత్య - గీతలా కనిపిస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ సందర్భంగా షాహిద్ కపూర్ కూడా మీడియాతో స్పందిస్తూ ఇందులో ఏమాత్రం ప్రత్యేకత లేదు. మేమిద్దరం సినీ పరిశ్రమలో ఉన్నాం. తరచుగా ఇటువంటి ఈవెంట్స్‌లో కలుసుకోవడం సహజమే. కానీ ఇది ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపించడం సంతోషంగా ఉంది అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Shahid reacts to hugging and meeting Kareena :

Shahid Kapoor and Kareena Kapoor Khan were seen sharing a hug and interacting at the IIFA 

Tags:   SHAHID KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ