సీనియర్ హీరోయిన్ రాధిక ఆసుపత్రిలో కనిపించడం ఆమె అభిమానులు ఆందోళనకు గురి చేసింది. ఎప్పడు గలగలా తిరుగుతుండే రాధికా సడన్ గా హాస్పిటల్ బెడ్ పై ఉన్న పిక్ ని షేర్ చేస్తూ.. మహిళా దినోత్సవం రోజు మహిళలు బలంగా ఉండాలని, సవాళ్లు ఎదురైనా ధైర్యం కోల్పోవద్దని, అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవాలలి అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ఓ షూటింగ్ లో తన కాలికి గాయమై తనని బాగా ఇబ్బంది పెట్టింది అని, ఎన్ని మందులు వాడినా తగ్గలేదని, చివరికి సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది అంటూ రాధిక తాను ఆసుపత్రికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది రివీల్ చేసింది. పలుమార్లు థెరపీ సెషన్ల తర్వాత కూడా నొప్పి వేధించింది అందుకే సర్జరీ చేయించుకున్నట్లుగా రాధికా చెప్పింది.
నొప్పి ఉంది కదా అని భయపడకూడదు. అన్ని ప్లానింగ్ ప్రకారమే జరగాలి. సర్జరీకి ముందు తన షూటింగ్ కమిట్‌మెంట్లన్నీ పూర్తయ్యేలా చూసుకున్నాను. షూటింగ్ చేసేటప్పుడు తీవ్రమైన నొప్పిని భరించాల్సి వచ్చేది. కోలుకునే సమయంలో తనను దగ్గరుండి చిన్నపిల్లలా చూసుకున్నందుకు తన భర్త శరత్‌కుమార్ కు రాధికా సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది.