Advertisementt

విశ్వంభర సెట్ లో శ్రీలీల - చిరు సత్కారం

Sun 09th Mar 2025 05:07 PM
chiranjeevi  విశ్వంభర సెట్ లో శ్రీలీల - చిరు సత్కారం
Chiru pays tribute to Sreeleela విశ్వంభర సెట్ లో శ్రీలీల - చిరు సత్కారం
Advertisement
Ads by CJ

ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న‌తో క‌లిసి ప‌ని చేసిన మ‌హిళ‌ల‌కు అలాగే ఇత‌ర మ‌హిళామ‌ణుల‌కు తన సోషల్ మీడియా వేదిక పైన శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు. 

మెగా స్టార్ చిరంజీవి హీరోగా వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో యువీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం విశ్వంభ‌ర‌ సినిమా ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. అదే స్టూడియోలో మ‌రో షూటింగ్‌లో ఉన్న శ్రీలీల‌కు ఈ విష‌యం తెలిసి త‌నెంత‌గానో అభిమానించే చిరంజీవి గారు స‌మీపంలో ఉన్నార‌ని తెలుసుకున్న శ్రీలీల‌ విశ్వంభ‌ర సెట్స్‌కు వెళ్లి చిరంజీవి గారిని క‌లిశారు.

మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న‌ను క‌లిసిన శ్రీలీల‌కు శాలువా క‌ప్పి స‌త్క‌రించిన దుర్గాదేవి రూపం ముద్రించిన శంఖాన్ని బ‌హుమ‌తిగా బ‌హుక‌రించారు మెగా స్టార్ చిరంజీవి గారు.

మెగాస్టార్ నుంచి వ‌చ్చిన ఈ ప్ర‌త్యేక‌మైన బ‌హుమ‌తిని అందుకున్న‌ శ్రీలీల సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

Chiru pays tribute to Sreeleela:

Chiranjeevi pays tribute to Sreeleela

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ