Advertisementt

బాలీవుడ్ హీరోయిన్స్ డేరింగ్ డెసిషన్స్

Sun 09th Mar 2025 01:17 PM
bollywood heroines  బాలీవుడ్ హీరోయిన్స్ డేరింగ్ డెసిషన్స్
Bollywood Actresses: Fearless Decisions in Balancing Career and Family బాలీవుడ్ హీరోయిన్స్ డేరింగ్ డెసిషన్స్
Advertisement
Ads by CJ

పెళ్లి చేసుకుంటేనే అవకాశాలు రావు అని చాలా మంది హీరోయిన్స్ వయసు మీద పడుతున్నా పెళ్లి విషయం ఎత్తకుండా కెరీర్‌ని కొనసాగిస్తూ ఉంటారు. ప్రేమలో ఉన్నా దానిని కంటిన్యూ చేస్తారు కానీ.. పెళ్లి మాత్రం చేసుకోరు. అలా సౌత్‌లో చాలామంది హీరోయిన్స్ పెళ్లి ఊసు ఎత్తకుండా సినిమాలు చేసుకుంటున్నారు. 

కానీ బాలీవుడ్ హీరోయిన్స్ ప్రేమలో పడిన రెండుమూడేళ్లకే పెళ్లి పీటలెక్కేస్తున్నారు. పెళ్లి చేసుకుని కెరీర్‌ని కంటిన్యూ చెయ్యడమే కాదు.. మంచి మంచి ఆఫర్స్ అందుకుంటున్నారు. అంతేకాదు బాలీవుడ్ హీరోయిన్స్ తీసుకుంటున్న డేరింగ్ డెసిషన్స్ అందరికి షాకిస్తున్నాయి. పెళ్లి చేసుకోవడం వరకు ఓకే .. కానీ పిల్లల్ని కూడా కనడం వారి డెసిషన్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు. 

పిల్లలు పుడితే షేప్ మారిపోతుంది. ఆటొమాటిక్‌గా బరువు పెరుగుతారు, అప్పుడు అవకాశాలు సన్నగిల్లుతాయి. అయినప్పటికి హిందీ హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుని చక్కగా టైమ్ సెట్ చేసుకుని పిల్లల్ని కనడమే కాదు. వర్కౌట్స్‌తో బాడీ‌ని షేప్ చేసుకుని తిరిగి నటనలోకి వచ్చేస్తున్నారు. గతంలో కరీనా కపూర్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా ఇప్పటికి హీరోయిన్‌గా కొనసాగుతుంది. 

ఇక అలియా భట్ పెళ్ళైన ఏడాది లోపే రాహా‌కి జన్మినిచ్చింది. మరుక్షణమే సినిమాలు చేసుకుంటుంది. మరో టాప్ తార దీపికా పదుకునే గత ఏడాది ఆడపిల్లకు జన్మనిచ్చింది. అటు అనుష్క శర్మ కూడా పెళ్లి చేసుకుని పిల్లలని కనేసింది. ఇప్పుడు కియారా కూడా పెళ్ళైన రెండేళ్లకే పిల్లలను ప్లాన్ చేసుకుంది. 

ఇది నిజంగా డేరింగ్ డెసిషన్ అని చెప్పాలి. పెళ్ళైతేనే అవకాశాలు పోతాయని భయపడే హీరోయిన్స్ పిల్లల్ని కనడానికి కూడా వెనుకాడడం లేదు. అటు పర్సనల్ లైఫ్‌ని, ఇటు కెరీర్‌ని బ్యాలెన్సుడ్ గా మలచుకోవడం నిజంగా మాములు విషయం కాదు.

Bollywood Actresses: Fearless Decisions in Balancing Career and Family:

How Bollywood Heroines Redefine Career After Marriage and Motherhood

Tags:   BOLLYWOOD HEROINES
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ