Advertisementt

అఖిల్ పెళ్లి అప్ డేట్ ఏది నాగ్

Sun 09th Mar 2025 01:07 PM
akhil  అఖిల్ పెళ్లి అప్ డేట్ ఏది నాగ్
What is the update on Akhil wedding అఖిల్ పెళ్లి అప్ డేట్ ఏది నాగ్
Advertisement
Ads by CJ

మార్చ్ వచ్చేసింది.. అక్కినేని ప్రిన్స్ అఖిల్ పెళ్లి ఈ నెలలోనే అన్నారు. మార్చ్ 24 న అఖిల్ - జైనబ్ ల వివాహం అంటూ మీడియాలో వార్తలు కనిపించాయి. అక్కినేని కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన ఏది లేదు. అఖిల్ తాను ప్రేమించిన జైనబ్ తో నవంబర్ చివరి వారంలోనే హైదరాబాద్ లో నిశ్చితార్ధం చేసుకున్నాడు. 

ఆ తర్వాత నాగ చైతన్య-శోభిత ల వివాహం, తండేల్ సక్సెస్, ఈ మద్యలో అఖిల్ CCL మ్యాచ్ లతో బిజీ  అవడం, ఆ తర్వాత దుబాయ్ లో వ్యాపారవేత్త పెళ్లి వేడుకలో అఖిల్ - నాగార్జున, అమల సందడి చేసారు. ప్రస్తుతం అక్కినేని ఇంట పెళ్లి వేడుకలు ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని అక్కినేని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. 

మార్చ్ 24 అంటే మరో 15 రోజుల్లోనే వచ్చేస్తుంది. మరి నాగార్జున చిన్న కొడుకు అఖిల్ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరపతల పెట్టారని తెలుస్తోంది. అది దుబాయ్ లోనా లేదంటే హైదరాబాద్ లోనా అనేది తెలియదు. జైనబ్ ఫ్యామిలీ దుబాయ్ ఉంటారు. అక్కడే వాళ్లకు వ్యాపారాలున్నాయి. మరి అఖిల్ పెళ్లి వేడుక ఎక్కడ అనేది కూడా నాగార్జున రియాక్ట్ అయితేనే తెలిసేది.

What is the update on Akhil wedding:

 Akhil wedding update

Tags:   AKHIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ