యాంకర్ కమ్ అనసూయ ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ తో సోషల్ మీడియాలో హీటెక్కిస్తోంది. జబర్దస్త్ మానేసినా సోషల్ మీడియాను అనసూయ వదలదు. తన స్పెషల్ ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఈ ఏజ్ లోను గ్లామర్ షూట్స్ తో అదరగొడుతుంది. అటు వెండితెర పై పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తున్న అనసూయ మరోమారు బుల్లితెర పై సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది.
స్టార్ మా లో ఇప్పటికే ఒక సీజన్ పూర్తి చేసుకున్న కిర్రాక్ బాయ్స్-కిలాడీ గర్ల్స్ సీజన్ 2 షో కోసం అనసూయ రెడీ అవడమే కాదు ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవడంతో అనసూయ ఆ లుక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా వైట్ శారీ లో అనసూయ అదిరిపోయే ఫోజులు వైరల్ అయ్యాయి.
ఫ్లోరల్ ప్రింట్ సారీ, డిజైనర్ బ్లౌజ్ లో అనసూయ కిర్రాక్ ఫోజులతో మతిపోగొట్టింది అంటే నమ్మాలి. అనసూయను అలా చూసి అనసూయ అందాలు కేకో కేక అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.